Breaking News

వికాస్ దూబేకి షాకిచ్చిన పోలీసులు... ఎన్‌కౌంటర్లో ప్రధాన అనుచరుడి కాల్చివేత


ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కరడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే‌ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అతడికి అత్యంత సన్నిహితుడైన అమర్‌ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ పట్టణంలో తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ పోలీస్ ఫోర్స్ అతడిని చుట్టముట్టి కాల్చి చంపేశారు. పోలీసుల కాల్చివేత కేసులో అమర్ దూబే కూడా నిందితుడని, అతడిపై రూ.25వేల రివార్డు ఉన్నట్లు అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అతడిపై గతంలో నమోదైన కేసుల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు. Also Read: 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కేసులో ప్రధాన నిందితుడైన వికాస్ దూబే, అతడి అనుచరులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. యూపీకి చెందిన 40 మంది పోలీసులతో కూడిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వీరి కోసం గాలిస్తోంది. బిజనూర్ పట్టణంలో అనుచరులతో కలిసి కారులో వెళ్తున్నట్లు పోలీసుల కంట పడినట్లు తెలుస్తోంది. అయితే అతడు చాకచక్యంగా తప్పించుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆ గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకునేందుకు యూపీ సరిహద్దు రాష్ట్రాలను పోలీసులు అప్రమత్తం చేశారు. Also Read: బిక్రూ గ్రామంలో తన ఇంట్లో ఉండగా పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై వికాస్ దూబేతో పాటు అతడి అనుచరులు కాల్పులు జరిపి 8 మందిని దారుణంగా చంపేసిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసింది. అతడిని పట్టుకునేందుకు వస్తున్నారన్న సమాచారాన్ని అవినీతిపరులైన కొందరు పోలీసులు ముందుగానే దూబేకు సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో కాన్పూరు‌లో పనిచేస్తున్న 68 మంది పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వికాస్ దూబేతో సన్నిహిత సంబంధాలున్నాయన్న అనుమానంతో కాన్పూర్ ఎస్పీ అనంత్ దియో తివారీని కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. దూబే స్వగ్రామం బిక్రూలోని అతడి సొంతింటిని పోలీసులు శనివారం బుల్‌డోజర్లతో నేలమట్టం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న ఖరీదైన కార్లను కూడా ధ్వంసం చేశారు. Also Read:


By July 08, 2020 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/amar-dubey-close-aide-of-vikas-dubey-shot-dead-in-police-encounter-in-hamirpur/articleshow/76846512.cms

No comments