నేపాల్ రాజకీయ సంక్షోభంలో చైనా జోక్యం.. నేడు తేలిపోనున్న ఓలీ భవితవ్యం!
నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో.. ఆయన్ని కాపాడేందుకు చైనా రంగంలోకి దిగింది. నేపాల్‌లో చైనా రాయబారి హో యాంకీ మంగళవారం కూడా అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) నేతలతో మంతనాలు జరిపారు. అధ్యక్షురాలు బింధ్యాదేవి భండారీ సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారాన్ని పంచుకునే విషయంలో ఓలి, అసమ్మతి నేత పుష్ప కమల్ దహాల్ ప్రచండకు మధ్య రాజీ కుదిర్చేందుకు యాంకీ ప్రయత్నించారు. ప్రధాని నివాసంలో ఓలి, ప్రచండ మరోసారి భేటీ కాగా... ప్రధాని, పార్టీ అధ్యక్ష పదవిలో ఒక్కరే కొనసాగడాన్ని అసమ్మతి నేతలు నిరసిస్తున్నారు. నేపాల్ వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని నిరసిస్తూ ఖఠ్మాండ్‌లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. కాగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం బుధవారం జరుగనుండగా.. చైనా ప్రయత్నాలు ఎంత వరకు సఫలమయ్యాయో తేలిపోనుంది. స్టాండింగ్ కమిటీలోని మొత్తం 44 మందిలో 30 మంది ఓలీ రాజీనామాకు పట్టుబడుతున్నారు. అధ్యక్షురాలు భండారీ దేవీ సైతం ఓలీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ, రాజీనామాకు ఓలీ నిరాకరిస్తే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం సహా క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించవచ్చు. అయితే, ప్రచండ, ఇతర అసమ్మతి నేతలు అంత దూరం వెళతారా అనేది స్పష్టంగా తెలియదు. ‘పార్టీలో చీలిక తీసుకువచ్చారనే నిందను తమవై వేసుకోడానికి ఎవరూ అంత సముఖంగా లేరు.. అగ్ర నేతాల్లో ఉన్న విభేదాలు అంత తీవ్రంగా లేవు.. వాటిని ఇంకా పరిష్కరించుకోవచ్చు’ అని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ నేత వ్యాఖ్యానించాడు. నేపాల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. భండారితో సమావేశాన్ని విదేశాంగ శాఖ ఆమోదించకుండా దౌత్యపరమైన నియమావళిని ఉల్లంఘించడం విశేషం. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయని ఓలీ కేబినెట్ సిఫారసును భండారి ఆమోదించారు. బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించే ఏ ప్రయత్నానికైనా ఈ సిఫారసు స్పష్టంగా ఉంది.
By July 08, 2020 at 09:24AM
No comments