పెళ్లి పేరుతో బాలిక కిడ్నాప్.. హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ అరెస్ట్
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ శివారు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో జరిగింది. కీసర మండలం నాగారం ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ షేక్ ఇర్ఫాన్(24) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం తన ఆటో ఎక్కిన బాలిక(17)తో అతడు పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి వెంట తిప్పుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించాడు. బుధవారం తెల్లవారుజామున బాలికను ఆటోలో ఎక్కించుకుని సైదాబాద్‌లోని బంధువుల ఇంట్లో దాచాడు. కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లి బుధవారమే మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. Also Read:
By July 24, 2020 at 09:36AM
No comments