Breaking News

Ram Gopal Varma: హే పీకే ఫ్యాన్స్.. ఆ రోజు గుర్తుంది కధ! మర్చిపోకండి.. మళ్ళీ కెలికిన ఆర్జీవీ


వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నిత్యం వార్తల్లో నిలిచే .. ఈ కరోనా కల్లోలాన్ని మరింతగా వాడేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినీ వర్గాలన్నీ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో విలవిల్లాడిపోతుంటే వర్మ మాత్రం తన రూటే సపరేటు అంటూ వరుసపెట్టి అడల్ట్ ఓరియెంటెడ్, సెటైరికల్ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే '' మూవీ ప్రకటించి.. ఆ మూవీ నుంచి వివాదాస్పద పోస్టర్స్, ట్రైలర్ రిలీజ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో సిచువేషన్ కాస్త వర్మ Vs పవన్ ఫ్యాన్స్‌‌గా మారిపోయింది. Also Read: 'పవర్ స్టార్' అంటూ సెటైరికల్ సినిమా తీయడమే గాక.. ఆర్జీవీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే ‘‘దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో నా కంపెనీ ఉంది’’ అంటూ వర్మ బహిరంగ సవాల్ విసరడం, దీనిపై రియాక్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ వచ్చి వర్మ ఆఫీసు అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేయడం.. ఆ వెంటనే పోలీస్ కేసు, రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో వర్మ Vs పవన్ ఫ్యాన్స్‌‌ ఇష్యూ జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం ఉదంతాన్ని రామ్ గోపాల్ వర్మ.. తనదైన కోణంలో పబ్లిసిటీ స్టంట్‌గా వాడేస్తున్నారనే వాదనలు జనాల్లో మొదలయ్యాయి. అంతా అలా అనుకుంటుండగానే ''హే పీకే ఫ్యాన్స్!'' అంటూ మరోసారి ఇష్యూని పెద్దది చేసే ప్రయత్నం చేస్తూ మరో సవాల్ విసిరారు వర్మ. హే పీకే ఫ్యాన్స్! ఆ రోజు (జులై 25) గుర్తుంది కధ! మర్చిపోకండి అంటూ మరో సెటైరికల్ పోస్టర్ వదిలారు ఆర్జీవీ. అంతటితో ఆగక మీ దాడి వల్లనే నా 'పవర్ స్టార్' ట్రైలర్ 30 లక్షల వ్యూస్ రాబట్టిందని, చాలా థాంక్స్ అని పేర్కొంటూ పుండు మీద కారం చల్లే కామెంట్ చేశారు వర్మ. దీంతో.. ఏదేమైనా వర్మ స్ట్రాటజీయే వేరు!! అని ముక్కున వేలేసుకుంటున్నారు ఈ పరిణామాలు చూస్తున్న సినీ విశ్లేషకులు.


By July 24, 2020 at 09:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-once-again-challenged-with-pk-fans/articleshow/77139372.cms

No comments