ఆడపడుచుని వ్యభిచార ముఠాకు అమ్మేసిన వదిన.. ప్రకాశం జిల్లాలో దారుణం
మైనర్ బాలికను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను కందుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతూ మధ్యలోనే ఆపేసింది. ఆమె తండ్రికి రెండు వివాహాలు కాగా.. బాలిక రెండో భార్య కూతురు. దంపతుల తరుచూ గొడవలు జరుగుతుండటంతో బాలిక అన్నా, వదిన వద్ద ఆశ్రయం పొందుతోంది. అయితే బాలిక తమ ఇంట్లో ఉండటం ఇష్టం లేని వదిన ఆమెను సింగరాయకొండకు చెందిన ఓ వ్యభిచార ముఠాకు అమ్మేసింది. Also Read: ఆ వ్యభిచార నిర్వాహకురాలు బాలికను కందుకూరు-సింగరాయకొండ రోడ్డులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఆ నరక కూపంలోని నుంచి ఎన్నోసార్లు తప్పించుకోవాలని చూసినా ఆమె వల్ల కాలేదు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం బాలిక డయల్ 100కి ఫోన్ చేసి తన గోడు చెప్పకుంది. దీంతో కందుకూరు పోలీసులు ఈ నెల 18వ తేదీన రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించి బాలికను రక్షించారు. Also Read: ఆదివారం కందుకూరు ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం డిశ్చార్జి చేశారు. వదిన డబ్బుల కోసం తనను వ్యభిచార ముఠాకు అమ్మేసిందని, నిర్వాహకురాలు మాధవి, ఆమె సహాయకుడు శ్రీకాంత్ తన పట్ల అమానుషంగా ప్రవర్తించి బలవంతంగా వ్యభిచారం చేయించారని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు నిందితులతో పాటు ఇంటి యజమాని నరసింహారావుపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ధనుంజయులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. Also Read:
By July 21, 2020 at 11:24AM
No comments