దారుణం.. కూతురితో కలిసి ఇంటికి వెళ్తున్న జర్నలిస్టుపై కాల్పులు
నడిరోడ్డుపై ఓ జరిగిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న విక్రమ్ జోషి అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి దుండగులు విచక్షణా రహితంగా విక్రమ్ జోషిపై కాల్పులకు పాల్పడ్డారు. ఆయన తన కూతురితో కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ కాల్పుల్లో ఆయన తలకు బుల్లెట్ తగిలింది. దీంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం ఘజియాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వస్తున్న ఆయన ఒక్కసారిగా కొందరు గుండాలు చట్టుముట్టారు. అతి దగ్గర నుంచి అతనిపై కాల్పులు జరిపారు. అతని తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన కూతురు తండ్రి పక్కనే కూర్చుని సాయం కోసం ఏడవడం మొదలు పెట్టింది. ఈ విజువల్స్ అన్ని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Read More: అయితే కాల్పులకు పాల్పడింది కొందరు పోకిరిలే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్ట్ విక్రమ్ జోషి తన మేనకోడల్ని వేధిస్తున్న కొంతమంది పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఆ పోకిరీలే ఈ పని చేసారని విక్రమ్ జోషి సోదరుడు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జోషి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో వీడియో రికార్డు అయ్యింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసినప్పటికి పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆయన సోదరుడు ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై స్పందించిన ఎస్‌ఎస్పీ తమకు సమాచారం అందిందని నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
By July 21, 2020 at 12:15PM
No comments