Breaking News

యూపీ ఎన్‌కౌంటర్: ఎదురు కాల్పుల్లో గ్యాంగస్టర్ అనుచరుల్లో మరో ఇద్దరు హతం


పోలీసుల కస్టడీలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగస్టర్ అనుచరుల్లో మరో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు కాల్చి చంపారు. ‘పోలీస్ కస్టడీలో ఉన్న వికాస్ అనుచరులు ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లాలను గురువారం ఉదయం కాన్పూర్ తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించారు. మార్గమధ్యలో పోలీసుల నుంచి తుపాకి లాక్కుని, వారిపై కాల్పులకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. నిందితులపై ఎదురు కాల్పులు జరిపడంతో చనిపోయారు’ అని కాన్పూర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయపడినట్టు ఆయన వెల్లడించారు. రిమాండ్‌కు తరలిస్తుండగా.. పంకీ గ్రామం వద్ద పోలీసులపై కాల్పులకు ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. ప్రభాత్ శుక్లాను ఫరీదాబాద్‌‌లో బుధవారం అరెస్ట్ చేసినట్టు ఆయన తెలియజేశారు. దూబే ప్రధాన అనుచరుడు, అతడి బంధువు బుధవారం జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. వికాస్ దూబే ప్రధాన అనుచరుడు, అతడి ‘షాడో’గా పేర్కొనే అమర్‌ దూబే ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు బుధవారం తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌‌లోని హమీర్‌పూర్‌ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్లు తెలుసుకున్న యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు బుధవారం (జులై 8) ఉదయం అతడిని పట్టుకోవడానికి వెళ్లగా ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు చెప్పారు. గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాన్పూర్‌లో గత గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన యూపీ పోలీసులు వికాస్ దూబే, అతడి అనుచరుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 40 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.


By July 09, 2020 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kanpur-firing-gangster-vikas-dubeys-another-close-aids-shot-dead-in-police-encounter/articleshow/76866722.cms

No comments