Vijay Sethupathi: తుగ్లక్ దర్బార్ ఫస్ట్‌లుక్.. నెట్టింట తెగ హల్చల్ చేస్తున్న డిఫరెంట్ పోస్టర్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కోలీవుడ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు . విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలుస్తున్న ఆయన.. హీరోగా, విలన్‌గా ఎన్నో పాత్రలు చేసి తన నటనా ప్రతిభను చాటారు. ఇటీవలే చిరంజీవి హీరోగా వచ్చిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ ''లో నటిస్తున్నారు. తాజాగా ఈ 'తుగ్లక్ దర్భార్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. చూడటానికి ఎంతో డిఫరెంట్‌గా ఉన్న ఈ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో కేవలం విజయ్ సేతుపతి డిఫరెంట్ షేడ్స్ మాత్రమే చూపిస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దీంతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఎక్కడ చూసినా ఇదే పోస్టర్ కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ 'తుగ్లక్ దర్భార్' ఫస్ట్‌లుక్ పోస్టర్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. Also Read: ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తుగ్లక్ దర్భార్' చిత్రానికి లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. రాధా కృష్ణన్ పార్థిబన్, అదితి రావ్ హైదరీ, మంజిమా మోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
By July 09, 2020 at 09:33AM
No comments