‘4 నెలలు నన్ను వాడుకుని వదిలేశాడు’.. ప్రియుడిపై యువతి ఫిర్యాదు
పెళ్లి పేరుతో యువతిని నమ్మించి శారీరక వాంఛలు తీర్చుకుని మొహం చాటేసిన యువకుడిపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన చింతకాయల కోదండరావు(25) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె అతడి ప్రేమను అంగీకరించడంతో షికార్లు తిప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగానూ కలిశాడు. Also Read: నాలుగు నెలలుగా ప్రియుడు తనను అన్ని విధాలా వాడుకుంటూ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఆమె కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలమంచిలి సీఐ వి.నారాయణరావు బుధవారం రాంబిల్లి ఎస్సైవి.అరుణ్‌కిరణ్‌తో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఆయన ఆదేశాలతో కోదండరావుతో పాటు అతడి తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 09, 2020 at 09:42AM
Post Comment
No comments