బ్రేకింగ్: కరోనా వైరస్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి
దేశంలో కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. రోజు రోజుకూ కేసులు పెరగటమే గాక, మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతుండటం భాయాందోళనలకు గురిచేస్తోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకిరి రామారావు (64) కరోనాతో కన్నుమూశారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇటీవల పోకూరి రామారావుకి సోకింది. దీంతో గత కొన్నిరోజులుగా ఆయన హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నేటి (శనివారం) ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు. Also Read: నిర్మాణ సంస్థ అయిన అధినేత పోకూరి బాబూరావు సోదరుడే . ఈ తరం ఫిలింస్ బ్యానర్‌లో రూపొందిన పలు చిత్రాలకు ఆయన చిత్ర సమర్పకుడిగా వ్యవహరించారు. పోకిరి రామారావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
By July 04, 2020 at 11:00AM
No comments