Breaking News

కరోనా వైరస్ గురించి తొలుత సమాచారం చైనా ఇవ్వలేదు.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్!


ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న విషయంలో ఇప్పటి వరకూ చైనాను వెనుకేసుకొచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ () స్వరం మార్చినట్టు కనిపిస్తోంది. తొలినాళ్లలో కోవిడ్-19 గురించి చైనాలోని తమ కార్యాలయమే సమాచారం ఇచ్చిందని, డ్రాగన్ ప్రభుత్వం కాదని తాజాగా ప్రకటించింది. వుహాన్‌లో న్యూమోనియా కేసులు నమోదయినట్టు అప్రమత్తం చేసిందని వ్యాఖ్యానించింది. అయితే, కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ మహమ్మారిని నివారించడానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. తమపై వస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగా ఏప్రిల్ 9 న సమాచార మార్పిడికి సంబంధించిన కాలపట్టికను డబ్ల్యూహెచ్ఓ ప్రచురించింది. కోవిడ్-19తో ప్రపంచవ్యాప్తంగా 521,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డబ్ల్యూహెచ్ఓ ఏప్రిల్ 9న పేర్కొన్న వివరాల ప్రకారం.. హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను డిసెంబర్ 31న వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమిషన్ గుర్తించినట్టు తెలిపింది. అయితే, అప్పట్లో ఎవరు తెలియజేశారో మాత్రం డబ్ల్యూహెచ్ఓ పేర్కొనలేదు. ఏప్రిల్ 20న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చైనా నుంచి తొలి నివేదిక వచ్చిందని చెప్పారు.. కానీ, నివేదికను పంపింది చైనా అధికారులు లేదా ఇంకెవరనేది వెల్లడించలేదు. అయితే, తాజాగా ఈ వారంలో కరోనా వైరస్ గురించి డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన కాలపట్టికలో మాత్రం తొలుత చైనాలోని తమ కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్టు పేర్కొంది. వైరల్ న్యుమోనియా కేసులను గుర్తించినట్టు వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్‌సైట్‌లో మీడియా కోసం డిసెంబరు 31న ప్రకటించిన తర్వాత చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయం తెలియజేసింది. అదే రోజు, అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్‌వర్క్ ప్రోమెడ్ సైతం వుహాన్‌లో అంతుచిక్కని కారణాల వల్ల న్యుమోనియా కేసులు బయటపడినట్టు వెల్లడించిన నివేదికను పరిగణనలోకి తీసుకుంది. ఈ నివేదికల ఆధారంగా కొత్తరకం వైరస్ కేసుల గురించి ఈ ఏడాది జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరితే, జనవరి 3న సమాచారం అందజేశారు. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక సంఘటనను అధికారికంగా ధృవీకరించడానికి, దాని స్వభావం లేదా కారణం గురించి అదనపు సమాచారాన్ని అందజేయడానికి దేశాలకు 24-48 గంటలు సమయం ఉందన్నారు. తమ నివేదికను ధృవీకరించమని కోరిన వెంటనే చైనా అధికారులు వెంటనే డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించారని ర్యాన్ తెలిపారు.


By July 04, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/who-says-first-alerted-to-coronavirus-by-its-office-not-china/articleshow/76780319.cms

No comments