Breaking News

శంషాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై యువకుడి అఘాయిత్యం


తొమ్మిదేళ్ల బాలికపై కన్నేసిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శంషాబాద్‌‌లో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్‌ మండలం పాలమాకులకు చెందిన దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 8న వారి కుమార్తె(9)ను ఇంటి వద్దే ఉంచి దంపతులు పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన శివప్రసాద్‌(22) పక్కనే ఉన్న పాడిబడిన ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు. బెదిరించి లైంగిక దాడికి యత్నించగా బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. Also Read: దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పడంతో వారు గ్రామ పెద్దలకు తెలిపారు. వారి సూచనతో బాలిక తల్లిదండ్రులు గురువారం శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివప్రసాద్‌‌పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శివప్రసాద్‌ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. Also Read:


By July 11, 2020 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-rape-attempt-on-minor-girl-in-shamshabad/articleshow/76904428.cms

No comments