Breaking News

ఫలించిన భారత్ మంత్రాంగం.. గాల్వాన్‌ లోయ నుంచి వెనక్కు తగ్గిన చైనా సైన్యం


సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత కొంత తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకున్నాయి. జూన్ 15న ఘర్షణ చోటుచేసుకున్న గాల్వాన్ లోయ నుంచి చైనా సైన్యం వెనక్కు తగ్గింది. ఆ ప్రాంతంలో ఇరు సైన్యాలు తాత్కాలిక నిర్మాణాలు నిలిపివేసి, వెనక్కు వెళ్లినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినట్టు పేర్కొన్నాయి. జూన్ 30న ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. మొదట గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్, ఉత్తరవైపు దెప్పాంగ్ మైదానాలు వంటి ప్రాంతాల్లోని అన్ని ఘర్షణ పాయింట్ల వద్ద బలగాల మళ్లింపు జరుగుతుందని సూచించారు.


By July 06, 2020 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-row-chinese-troops-pull-back-2-km-from-site-of-galwan-valley-clashes-says-govt-official/articleshow/76809253.cms

No comments