Breaking News

వంశీకి మహేష్ ఛాన్స్ ఇస్తున్నాడా..?


సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తానని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ వంశీ చెప్పిన స్క్రిప్టు నచ్చక, పరశురామ్ తో సినిమా ఒప్పుకున్నాడు. మహర్షి సినిమా తర్వాత సంవత్సరం వెయిట్ చేసిన వంశీని మహేష్ రిజెక్ట్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందన్న ప్రచారం వినబడుతుంది.

గత కొన్ని రోజులుగా మహేష్ తాను హీరోగా నటించే సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అదీ గాక తన నిర్మాణంలో ఇతర హీరోలతో సినిమాలు కూడా చేస్తున్నాడు. అడవి శేష్ హీరోగా ఉన్ని క్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమా తెరకెక్కుతుంది. తాజా సమాచారం మహేష్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడని టాక్. మహేష్, విజయ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ కారణంగానే విజయ్ దేవరకొండ సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ అనంతరం ఈ సినిమా స్టార్ట్ కానుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయమై అధికారిక ఎప్పుడు వస్తుందో చూడాలి.



By July 07, 2020 at 06:18PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51737/mahesh-babu.html

No comments