ప్రాణం తీసిన జోక్.. వ్యాపారవేత్తని కొట్టి చంపేసిన స్నేహితులు
స్నేహితుల మధ్య సరదాలు, జోకులు, ముచ్చట్లు, పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి కొందరు వేసే జోకులు ఎదుటివారిని కించపరిచేలా ఉన్నా మనోడే కదా అని స్నేహితులు లైట్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు అలాంటి జోకులే ప్రాణాలు కూడా తీస్తాయి. నోయిడాకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య సోని ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు. Also Read: ఈ నెల ఐదో తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఆదిత్య తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం గ్యాంగ్ కాలువలో అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో అతడి స్నేహితులైన పంకజ్, దేవ్ అనే ఇద్దరు వ్యక్తులను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. Also Read: ఐదో తేదీన తమను కలవడానికి వచ్చిన ఆదిత్య మాటల మధ్యలో కించపరిచేలా జోక్ వేశాడని, దీంతో తమ మధ్య వాగ్వాదం జరిగిందని నిందితులు తెలిపారు. తామిద్దరం కర్రలతో తలపై కొట్టడంతో చనిపోయాడని చెప్పారు. తర్వాత అతడి సెల్‌ఫోన్, శరీరంపై ఉండే బంగారు ఆభరణాలు తీసుకుని శవాన్ని గ్యాంగ్ కాలువ సమీపంలోని డంపింగ్ యార్డులో పడేసినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 14, 2020 at 12:50PM
No comments