Breaking News

Power Star: వర్మది ఆడంగితనం.. ఫ్యాన్స్ తెగిస్తే పార్టీ పట్టించుకోదనే భయం, లేదంటే..: జనసైనికుడు (మాజీ)


పవన్ కళ్యాణ్ అభిమానులు టెంపర్ లూజ్ అవుతుంటారనే మైనస్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నమే ‘పవర్ స్టార్’ సినిమా అన్నారు మాజీ జనసైనికుడు, పవన్ అభిమాని, లాయర్ కళ్యాణ్ సుంకర. వర్మ.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఆయన ఇచ్చిన లోకువే అన్నారాయన. ఒకవైపు వర్మ ‘పవర్ స్టార్’ సినిమాను లైట్ తీసుకుని ఇది స్వార్ధపరులు, దుష్టశక్తుల కుట్రగా అభివర్ణిస్తూ.. రెచ్చగొట్టి బురదలోకి లాగాలని వర్మ ద్వారా రాజకీయ కుట్ర చేస్తున్నారు.. ఈ ట్రాప్‌లో జనసైనికులు పడొద్దంటూ.. పవన్ అభిమానులు సంయమనం పాటించాలని జనసేన పిలుపునిచ్చింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఇష్యూపై పవన్ అభిమాని కళ్యాణ్ సుంకర వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ తరపున జనసైనికులు స్పందించాలి.. స్పందించకూడదనే విషయంపై జనసేన మీడియా హెడ్ ప్రకటన విడుదల చేశారు. అది వాళ్ల వ్యక్తిగతం. వర్మ ‘పవర్ స్టార్’లో ఏం తీయబోతున్నాడో తెలియదు కాబట్టి.. ఒకవేళ కాంట్రవర్శీగా తీస్తే అప్పుడు స్పందిద్దాంలే అని జనసేన అనుకుని ఉండొచ్చు. కాని.. నేను ఏమంటానంటే స్పందించాల్సిన అవసరం ఉంది. వర్మ గతంలో కూడా.. నన్ను చంపే మగాడు పుట్టలేదు.. విజయవాడ వస్తున్నా.. కాస్కోండి అన్నాడు. నిజంగానే విజయవాడ వచ్చాడు.. కాని ఆయనపై చిన్న గీత కూడా పెట్టలేదు ఎవరూ.. ఎందుకంటే మళ్లీ ఆయన్ని ఏమైనా చేస్తే జైలు, బెయిలు గోల ఎందుకు అని. నిజంగానే ఆయన విజయవాడ వచ్చినప్పుడు ఎవడైనా ఏదైనా చేసి ఉంటే వర్మ కాన్ఫిడెన్స్ ఓ 20 శాతం తగ్గేదేమో. ఆ ప్రయత్నం ఎవడూ చేయలేదు. అది మంచిదే. పవన్ ఇష్యూలో అభిమానులు సీరియస్ రియాక్ట్ అవ్వాలన్నా.. మమ్మల్ని పార్టీ కాపాడుతుందనే కాన్ఫిడెన్స్ పార్టీ నుంచి వచ్చి ఉండాలి. లేదంటే.. తట్టుకోలేక ఏదైనా చేసినప్పుడు వీళ్లకు మాకు సంబంధం లేదని జనసేన ప్రెస్ నోట్ ఇస్తుందనే భయంతో నైనా జనసైనికులు ముందుకు రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సున్నితంగా ముందుకు వెళ్లాలి. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయడానికి తెగించే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. కాని వాళ్లకు సరైన గైడెన్స్ ఇవ్వాలి. నేను పార్టీ నుంచి బయటకు వచ్చేశాను కాబట్టి.. పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. నేను ఒక లాయర్‌గా సామన్య వ్యక్తిగా వర్మను ప్రశ్నిస్తున్నా. వర్మ.. మిగతా హీరోలపైన రాజకీయ నాయకులపైన సినిమాలు ఎందుకు తీయడం లేదు... వర్మ చేతకాని తనం ఆడండితనం ఇక్కడ వరకూ ఉందంటే.. పవన్‌ని టార్గెట్ చేయడం వరకే. ఆర్జీవీ అనే పనికిమాలిన వ్యక్తి.. అనవసరమైన విషయాలపై ఫోకస్ పెడతాడు. కాని శృతిమించి ఒకే వ్యక్తిని పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఆయన చెప్పనవసరం లేదు.. అందరికీ తెలుస్తూనే ఉంది. దీనిపై పార్టీ కూడా సీరియస్‌గా స్పందించి లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా.. వర్మది ఎంత పైత్యం కాకపోతే.. పవన్ పుస్తకాలు తిరగేసి చదువుతాడా?? ఈయన చూశాడా?? కమ్మ రాజ్యంలో కడపరెడ్లులో ఆయన్ని ఎలా చూపించారు.. పవన్‌కి పుస్తకాలు అంటే ఇష్టం.. చదువుతాడు.. ఈయన ఎలా చూపించారు.. ఇది ఆయన చేతకాని ఆడంగితనమే కదా అంటూ ఫైర్ అయ్యారు కళ్యాణ్ సుంకర.


By July 14, 2020 at 12:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/janasena-ex-leader-kalyan-dileep-sunkara-strong-warning-to-ram-gopal-varma-over-power-star-movie/articleshow/76955138.cms

No comments