భార్యను పుట్టింటికి పంపి.. విజయవాడలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వేకాలనీలో విష్ణువర్ధన్ (32) సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈశాబత్తుల విష్ణువర్ధన్ డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలోని విద్యుత్తు విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ 118ఎ క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. కొన్నాళ్ల క్రితం ఏలూరుకు చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. విష్ణువర్ధన్ భార్య, కుమార్తెతో కలిసి విజయవాడలో ఉంటుండగా, తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా బిట్రగుంటలో నివాసముంటున్నారు. Also Read: భార్య, పాపతో కలిసి ఏలూరులోని పుట్టింటికి వెళ్లగా విష్ణువర్ధన్ ఒంటరిగా ఉన్నాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అతడి సోదరుడు సాగర్ వచ్చి ఇంటి తలుపు కొట్టగా ఎంతకీ తెరవలేదు. అనుమానంతో కిటికీలో నుంచి చూడగా ఇనుప కడ్డీలకు చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. దీంతో సాగర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఎస్ఐ విజయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. విష్ణువర్ధన్ భార్య, తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 14, 2020 at 01:27PM
No comments