Breaking News

అభిమానులకు భూమిక ఛాలెంజ్.. మూడు మొక్కలు నాటాల్సిందే


ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ భూమిక. పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులెవరూ ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ తర్వాత కూడా ప్రముఖ హీరోలతో జత కట్టి సినిమాలతో అలరించారు భూమిక. తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఇటీవలే నాని ఎంసీయేలో వదిన క్యారెక్టర్‌లో నటించారు. తాజాగా భూమిక రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెం‌జ్‌లో పాల్గొన్నారు. Read More: ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోన్న ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో ను స్వీకరించి డైరెక్టర్ సంపత్ నంది , హీరోయిన్ భూమికా చావ్లాకు ఛాలెంజ్ విసిరారు. డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ఈ రోజు తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం భూమికా చావ్లా మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి భూమిక కృతజ్ఞతలు తెలిపారు.


By July 18, 2020 at 01:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-bhumika-chawla-accepts-green-india-challenge/articleshow/77032805.cms

No comments