గీత సాక్షిగా ఏదో నిజం చెబుతానంటున్న సాయిధరమ్ తేజ్


పిల్లా నువ్వులేని జీవితం అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో మెగా హీరో . మెగా బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, చిత్రలహరి, ప్రతీరోజూ పండగే వంటి మంచి సినిమాల్లో నటించాడు. తాజాగా మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ మెగా హీరో. వెండితెరపై ‘’ ప్రమాణం చేసి నిజాన్ని చెప్పాలనుకుంటున్నారట సాయిధరమ్‌ తేజ్‌. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపాల్‌ అనే ఓ కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. Read More: ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటీవలే విడుదలైన సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతీరోజూ పండగే సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం మనోడు ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు దేవ కట్టా డైరెక్ట్‌ చేయనున్న సినిమాలో కూడా హీరోగా నటించనున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడితో కూడా మరో సినిమాను ప్లాన్ చేసే పనిలో పడ్డాడు ధరమ్ తేజ్. తన కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.


By July 18, 2020 at 02:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-next-movie-title-as-bhagavadgita-sakshiga/articleshow/77033613.cms

No comments