Breaking News

సోనూ సూద్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే.. ప్రకాష్ రాజ్ కామెంట్స్


మొన్నటి వరకూ దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపించిన సోనూసూద్ పేరు. తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు నాగేశ్వరరావు.. తన ఇద్దరు కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియో చూసి చలించిపోయిన సోనూసూద్ గంటల వ్యవధిలోనే ఆ ఇంటికి ట్రాక్టర్ పంపి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో రీల్ లైఫ్ విలన్ సోనూసూద్‌ని రియల్ లైఫ్ హీరోగా అభివర్ణిస్తూ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇదే సందర్భంలో సోనూసూద్ స్థాయిలోనూ అనేకమంది వలస కార్మికులకు కరోనా కష్టం నుంచి ఆదుకున్న ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోనూ సూద్‌ సాయం పట్ల ప్రశంసలు కురిపించారు. ‘సోనూసూద్ నిజమైన హీరో.. అతను రీల్ లైఫ్‌లో విలన్ కాని.. రియల్ లైఫ్‌లో హీరో.. ఆయనది ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం. ఎంతోమందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. నీ.. నా అనేభేదం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. వలస కార్మికుల్ని ఇంటికి పంపించడం కాని.. సొంత ఖర్చుల్ని భరిస్తూ వాళ్లు సొంత ఊర్లకు వెళ్లి సొంత వ్యాపారాలు పెట్టుకోవడం కాని.. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు ఉపాది కోల్పోయి కూతుళ్లతో పొలం దున్నుతుంటే అది చూసి చలించిపోయి ట్రాక్టర్ కొనివ్వడం కాని.. ఆయన చేస్తున్న సేవకు పరిధులు లేవు. మనిషిలో హుమానిటీ ఇంకా ఉంది అని మనిషిలో ప్రేరణ కలిగించే విషయం ఇది. ఇలాంటివి చూసైనా.. పదిమందికి సాయం చేయాలని ఇంకొంతమంది ముందుకు వస్తారు.. సోనూసూద్ ఏదో ఆశించి అయితే ఇలాంటివి చేస్తున్నారని అనుకోవడం లేదు. కేవలం పది మందికి ప్రేరణగా నిలవడానికి చేస్తున్నారు. ఆయనలా ఇంకా చాలామంది చేస్తున్నారు. ఇంకొంతమంది ముందుకు రావాలి. నా వరకూ వస్తే.. ప్రకాష్ రాజ్ కరోనా కాలంలో ఎంతో చేశారని అంటున్నారు. కాని చెప్పని పేర్లు చాలా ఉన్నాయి. హ్యాపీ డేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫోన్ చేసి.. సార్!! కరోనా బాధితులకు నేను ఏదో చేయాలని అనుకుంటున్నాను.. కాని నా వల్ల కాదు.. నేను కొంత డబ్బు పంపిస్తా.. మీరు చేయండి అని అన్నారు. శ్రీనాథ్ అనే బిల్డర్, త్రినాథ్ అనే డైరెక్టర్, రెడ్డి అనే మరో వ్యక్తి ఇలా చాలామంది నాకు డబ్బులు పంపించారు. సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది.. దాన్ని ఎలా ఇవ్వాలి?? ఏం చేయాలన్నది చాలా మందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నిజమైన బాధితులకు సాయం చేరేలా కష్టపడి పనిచేసేవాళ్లకు దాన్ని అందిస్తుంటారు. డబ్బు ఉండి ఇవ్వడం వేరు.. కాని రాత్రి పగలు సాయం కోసం కష్టపడటం లాంటిది నిజంగానే ఇన్స్‌పైరింగ్ ఇప్పుడు సోనూసూద్ అదే చేస్తున్నారు. ఎవరో అడుగుతారు సాయం చేయాలని వెయిట్ చేయడం లేదు.. అడగలేని సిగ్గుతో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. వాళ్లకీ సాయం చేయడం పెద్ద కష్టం కాదు. మంచి మనసుతో అడుగుముందుకు వేస్తే మరికొంత మంది మన వెనుకు నడుస్తారు. సోనూసూద్ సాధ్యం కాదు అనుకున్న పనుల్ని కూడా చేసి చూపిస్తున్నాడు’ అంటూ ప్రశంసలు కురిపించారు ప్రకాష్ రాజ్.


By July 29, 2020 at 08:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-prakash-raj-praises-real-life-hero-sonu-sood/articleshow/77232389.cms

No comments