హైదరాబాద్: కామ పిశాచిగా మారిన మహిళ... తొమ్మిదో భర్త చేతిలో దారుణ హత్య
హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో వరలక్ష్మి(30) అనే మహిళ భర్త నాగరాజు చేతిలో దారుణహత్యకు గురైన ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పరాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వారితో నెరుపుతున్న ఆమె ప్రవర్తన పట్ల విసిగిపోయిన భర్త చివరికి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వరలక్ష్మికి అప్పటికే 8 పెళ్లిళ్లు అయ్యాయని, నాగరాజు తొమ్మిదో భర్త అని తెలిసి పోలీసులతో పాటు స్థానికులూ అవాక్కయ్యారు. Also Read: పహాడీషరీఫ్ పీఎస్ ఎస్ఐ కుమారస్వామి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపల్ పరిధి శ్రీరామకాలనీలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే వరలక్ష్మితో రెండేళ్ల క్రితం పరిచయమై ప్రేమగా మారింది. అప్పటికే ఆమెకు భర్త, బాబు ఉన్నారు. నాగరాజుపై ప్రేమతో కుటుంబాన్ని వదిలేసి అతడిని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు అతడితో బాగానే కాపురం చేసిన వరలక్ష్మి తర్వాత తన అసలు బుద్ధిని బయటపెట్టింది. Also Read: అనేక మంది పరాయి వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కూడా పెద్ద గొడవ జరగడంతో నాగరాజు ఆవేశంతో ఆమె గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో వరలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. Also Read: దీంతో నాగరాజు నేరుగా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి లొంగిపోయాడు. అయితే పోలీసుల విచారణలో వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని తేలడంతో నిందితుడితో పాటు అందరూ షాకయ్యారు. వరలక్ష్మి పెళ్లయినా ఇతర వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ ఉండేదని, ఈ క్రమంలోనే భర్తతో గొడవపడి విడిపోయి వెంటనే మరొకరిని పెళ్లి చేసుకునేదని పోలీసులు తెలిపారు. Also Read:
By July 29, 2020 at 08:44AM
No comments