పవన్‌కి కథ చెప్పిన మాట వాస్తవమే కాని.. ఆరోజు ఏమైందంటే: వర్మ ఓపెన్ సీక్రెట్స్
రామ్ గోపాల్ వర్మ.. పదే పదే మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తారు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు వర్మ సినిమాలను రిజెక్ట్ చేసినందుకే ఆ ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేస్తున్నారనేది చాలా మంది మెగా అభిమానుల వాదన. అయితే నిజంగానే వర్మ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను కలిశారా?? వారికి కథ చెప్పారా?? వాళ్లు నో చెప్పారా?? అసలేమైందో వివరించారు ఆర్జీవీ. అందరూ అనుకున్నట్టు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేనూ.. మేం ముగ్గురం ఎప్పుడూ కలిసి స్టోరీ డిస్కస్ చేసింది లేదు. పవన్ కళ్యాణ్‌ను వేరేగా.. చిరంజీవిని వేరేగా కలిశాను. పవన్ కళ్యాణ్‌కి ఒక కథ చెప్పిన మాట నిజమే. కాని అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ఇది జరిగి 25 ఏళ్లు పైనే అవుతుంది. నేను తీసే సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్‌ని కలిశా. కథ చెప్పా.. కాని ఆయన లేచి సీరియస్‌గా వెళ్లిపోయారు. నేను చేయను అన్నారు. పవన్ చేసింది కరెక్టే.. ఎందుకంటే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు.. ఆ సందర్భంలో నేను వేరే రోల్ కోసం అడిగా.. ఆయనకు నచ్చలేదు.. చేయను అన్నారు.. అది ఆయన ఇష్టం. ఆ సినిమా పెద్ద ప్లాఫ్ అయిన తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్‌ని కలిసి నీ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పా.. ఒక ఫిల్మ్ మేకర్‌కి ఇలాంటి సందర్బాలు వందల్లో ఎదురౌతుంటాయి. నాకు పవన్‌తో ఎదురైంది. ఎన్నో సందర్భాల్లో నేను సరిగ్గా జడ్జిమెంట్ చేయలేనని కూడా చెప్పా.. దాని తరువాత పవన్ కళ్యాణ్‌ని చాలాసార్లు కలిశా. జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడా.. స్పీచ్ అదిరిపోయిందని చెప్పా. పవన్ నా సినిమాలో చేయలనేదనే బాధ, బెంగ లేదు.. అది నేను ఎప్పుడో మరిచిపోయా. ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం.. పొలిటీషియన్‌గా ఇష్టపడటానికి నాకు పాలిటిక్స్ అంటే తెలియదు. ఎందుకంటే నేను న్యూస్ వినను. ప్రజల సమస్యలపై నాకు ఉన్న అవగాహన జీరో. అలాంటప్పుడు వాటిపై పవన్ కళ్యాణ్ చెప్పినా వినను.. జగన్ చెప్పినా వినను.. సీబీఎన్ చెప్పినా వినను. ఎందుకంటే నాకు తెలియదు. నాకు పర్శనల్‌గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం. నా లైఫ్‌లో నేను ఎవర్నీ ద్వేషించను.. ఎందుకంటే నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కోపం అనేది వాలిబుల్ ఎమోషన్. నాకు ఏ మాత్రం ఇంటరాక్షన్ లేకుండా ఒక మనిషిపై కోపం చూపించాల్సిన అవసరం నాకేం ఉంది.. నాకు చిరంజీవి ఫ్యామిలీపై కోపం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు ఆర్జీవీ.
By July 29, 2020 at 09:53AM
No comments