Breaking News

యువతిపై పినతండ్రి రేప్.. అశ్లీల వీడియోల్లో నటించాలంటూ బ్లాక్‌మెయిల్


కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కూతురిలాంటి యువతిపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు తన తల్లి కూడా సహకరించిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరుకు చెందిన రీమా అనే మహిళ కొన్నాళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. కూతురితో కలిసి(20) విడిగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే అరికెరె సామ్రాట్‌ లేఔట్‌లో నివసించే అలెగ్జాండర్‌ దాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అలెగ్జాండర్ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. రీమా కూతురు కూడా వారితోనే ఉంటూ ఓ కాలేజీలో చదువుతోంది. Also Read: ఈ క్రమంలోనే ఆ యువతిపై కన్నేసిన అలెగ్జాండర్ తన కోరికను రీమాకు చెప్పాడు. అడ్డు చెప్పాల్సిన ఆమె కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసేందుకు సహకరించింది. కూతురు తినే ఆహార పదార్ధాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేది. ఆమె మత్తులోకి జారుకున్నాక అలెగ్జాండర్ లైంగిక దాడికి పాల్పడేవాడు. ఏడాదిన్నర క్రితం ఆ యువతిని హైదరాబాద్‌కు తీసుకెళ్లిన అతడు ఓ హోటల్‌లో మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె మేల్కొనేసరికి శరీరంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లు తెలుసుకుంది. ఈ విషయాన్ని తల్లికి చెబితే అలెగ్జాండర్‌కే మద్దతు తెలిపింది. Also Read: ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో పాటు ఆమె మొబైల్ ఫోన్ లాక్కుంది. కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించింది. దీనికి తోడు మోడలింగ్ చేయాలని, పోర్న్ వీడియోల్లో నటించాలంటూ ఇద్దరూ కలిసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేవారు. తాము చెప్పినట్లు వినకపోతే రేప్ చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించేవారు. వారి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు చివరికి బెంగళూరులోని హుళిమావు పోలీసులను ఆశ్రయించింది. అలెగ్జాండర్‌తో పాటు తల్లిపైనా ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అలెగ్జాండర్ కోసం గాలిస్తున్నారు. Also Read:


By July 13, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/step-father-rapes-young-woman-several-times-in-bengaluru/articleshow/76933110.cms

No comments