క్వారంటైన్ కేంద్రంలో కామాంధుడు.. చికిత్స కోసం వచ్చిన బాలికపై రేప్
కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలు కామాంధులకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటికే అనేకచోట్ల క్వారంటైన్ కేంద్రాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో మరో దారుణ ఘటన జరిగింది. కరోనా చికిత్స కోసం క్వారంటైన్ కేంద్రానికి వచ్చిన బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: పాట్నాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మహేష్ ప్రసాద్ అనే వ్యక్తి మూడు నెలల నుంచి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో అక్కడికి వచ్చిన బాలికపై మహేష్ కన్నేశాడు. ఆమె వివరాలు నమోదు చేస్తున్నట్లు నాటకమాడి ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని క్వారంటైన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. Also Read: ఈ ఘటనపై క్వారంటైన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ దిల్మనీ మిశ్రా తీవ్రంగా స్పందించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. Also Read:
By July 16, 2020 at 09:59AM
No comments