ఉద్యోగాల పేరుతో మహిళల నిలువు దోపిడీ... విశాఖలో కేటుగాడు అరెస్ట్
ఉద్యోగాలు, ఇంటర్వ్యూలంటూ మాయమాటలతో మహిళలను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు కాజేస్తున్న మోసగాడిని విశాఖలోని గాజువాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బండారు రామ్‌చరణ్ కుమార్ అలియాస్ రవి.. రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో పేద మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ వారి నుంచి బంగారు ఆభరణాలు కాజేసేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రకాశ్‌నగర్ పోలీసులు గతంలో అతడిని అరెస్ట్ చేయగా.. జూన్ ఒకటో తేదీన అక్కడ నుంచి తప్పించుకొని పరారయ్యాడు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. Also Read: తన మకాం విశాఖకు మార్చిన రామ్‌చరణ్ లంకెలపాలెంలోని వాంబే కాలనీలో అద్దెకు దిగాడు. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు అతడిని నమ్మారు. దీంతో వారి ఇంటర్వ్యూల పేరుతో చాలా ఆఫీసులకు తిప్పాడు. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు ఎలాంటి ఆభరణాలు ధరించకుండా పేదవారిగా కనిపిస్తే ఉద్యోగం వస్తుందని నమ్మించాడు. తాను ఆభరణాలు భద్రంగా దాస్తానని చెప్పి వారి నుంచి తీసుకుని పరారయ్యాడు. Also Read: మోసపోయామని గ్రహించిన మహిళలు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం శ్రీనగర్ జంక్షన్ వద్ద పట్టుకున్నారు. అతడి నుంచి 4 తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. రామ్‌చరణ్‌పై గాజువాకలో 3, రాజమహేంద్రవరంలో 4, విజయవాడలో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By July 11, 2020 at 09:01AM
No comments