‘కోరిక తీర్చకపోతే అంతు చూస్తా’.. ఏలూరులో వివాహితకు లైంగిక వేధింపులు
పెళ్లయి భర్త, పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటున్న మహిళపై ఓ కామాంధుడి కన్ను పడింది. తన కోరిక తీర్చకపోతే అంతు చూస్తానంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు మరింత రెచ్చిపోయాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన ఆమె చివరికి చావే శరణ్యమనుకుని ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఏలూరులో జరిగింది. Also Read: మండలానికి చెందిన వివాహిత పనిచేసే ప్రాంతం నుంచి ఇంటికి వచ్చే సమయంలో స్థానికంగా ఉండే కర్రి వేణుగోపాల్ అనే వ్యక్తి కొద్దిరోజులుగా వెంటపడి కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. తన మాట వినకపోతే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీనిపై ఆమె మూడు రోజుల కిందట ఏలూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఈనెల 9న ఆమెను మళ్లీ బెదిరించాడు. తన కోరిక తీర్చకుండా ఎలా తప్పించుకుంటావో చూస్తానంటూ వేధింపులకు గురిచేశారు. Also Read: దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు అదే రోజు రాత్రి బ్లేడుతో చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. తానిచ్చిన ఫిర్యాదు ప్రకారం కాకుండా వేణుగోపాల్‌పై మరోలా పోలీసులు కేసు నమోదు చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. పోలీసులతో తనకు న్యాయం జరగదని భావించడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించిన తనను ఆ కామాంధుడి బారి నుంచి కాపాడాలని వేడుకుంటోంది. Also Read:
By July 11, 2020 at 08:41AM
No comments