Breaking News

విశాఖ బాలికపై ముగ్గురు కామాంధుల పైశాచికం.. ఏడాదిగా గ్యాంగ్ రేప్ చేస్తూ


తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో నాయనమ్మ ఇంట్లో ఉంటోంది. తొమ్మిదో తరగతి తర్వాత చదువు మానేయడంతో లోకం పోకడ తెలియదు. మంచి చెడులకు మధ్య తేడా తెలియని కౌమార దశలో ఉంది. నాయనమ్మ, తాత వ్యవసాయ కూలీలు కావడంతో పగటిపూట ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ముగ్గురు కామాంధులు ఆమెను చెరబట్టారు. రోజూ ఆమెపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఆరు నెలలుగా జరుగుతున్న ఈ కీచకపర్వం బాధితురాలు గర్భం దాల్చడంతో వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొత్తలిలో ఈ ఘటన జరిగింది. Also Read: కొత్తలి గ్రామానికి చెందిన బాలిక(15)కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటోన్న ఆమె తొమ్మిదో తరగతి వరకూ చదివి మానేసి ఇంట్లోనే ఉంటోంది. నాయనమ్మ, తాతయ్యలు రోజూ కూలిపనుల కోసం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగొస్తారు. దీంతో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. ఏడాదిగా ఆమెను బెదిరిస్తూ శారీరకంగా లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. దీంతో బాధితురాలు గర్హం దాల్చింది. ఆమె శరీరంలో మార్పులు గమనించిన నాయనమ్మ తుని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించింది. డాక్టర్లు ఆమె ఆరు నెలల గర్భవతి అని చెప్పడంతో నాయనమ్మ షాకైంది. Also Read: దీంతో ఏం జరిగిందని బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. నిందితుల్లో ఒకరు పెయింటర్, మరొకరు వ్యవసాయ కూలీ, మూడో వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడని చెప్పింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఎలమంచిలి గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By July 06, 2020 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-men-rapes-minor-girl-for-one-year-in-vizag-district-case-booked/articleshow/76805605.cms

No comments