అర్ధరాత్రి వివాహితపై అఘాయిత్యం.. హైదరాబాద్ నడిబొడ్డున దారుణం
అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతున్న వివాహితను బయటకు లాక్కొచ్చి అత్యాచార యత్నానికి యత్నించిన దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్ ప్రాంతంలో దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం అర్ధరాత్రి కుటుంబమంతా ఇంట్లో నిద్రపోతున్న సమయంలో స్థానికంగా ఉండే ఇద్దరు యువకులు మద్యం మత్తులో తలుపులు తట్టారు. ఆమె తలుపు తీయగానే జుట్టు పట్టుకుని బయటకు లాగి మరో ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయారు. Also Read: ఒకడు ఆమెపై పడి పశువులా ప్రవర్తించడగా మరొకడు దాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఆ కామాంధులు దుర్భాషలాడుతూ ఎదురుతిరగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 09, 2020 at 08:32AM
No comments