హైదరాబాద్‌లో తల్లీకొడుకుల కిడ్నాప్.. నిందితుల కోసం పోలీసుల వేట
హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో తల్లీ, కొడుకు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని గంధంగూడకు చెందిన ఆదిలక్ష్మి(37) నాంపల్లి కోర్టులో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కొద్దిరోజులుగా ఆమె ఇంటికే పరిమితమైన ఆమె రోజూ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం ఇద్దరు కొడుకులతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మితో పాటు ఓ కుమారుడు ప్రజ్వన్‌ను అపహరించారు. Also Read: తల్లీ కొడుకును కిడ్నాపర్లు కారులో బలవంతంగా ఎక్కిస్తుండగా ఆలయ పూజారి గమనించి వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని పూజారి నుంచి వివరాలు సేకరించారు. వారి కోసం గాలిస్తుండగానే కిడ్నాపర్లు చేవెళ్ల వైపు కారులో వెళ్తున్నట్లు సమాచారం అందించింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు చేవెళ్ల వద్ద వారిద్దరిని కారులో నుంచి దించేసి పరారయ్యారు. Also Read: పోలీసులు ఆదిలక్ష్మి, ఆమె కొడుకును అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించడందో కథ సుఖాంతమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆదిలక్ష్మి ఆంజనేయస్వామి దేవాలయంలో రోజూ 11 ప్రదక్షిణలు చేయడానికి వస్తుంటారని ఆలయ పూజారి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు గుడిలోనే ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారన్నది దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By July 09, 2020 at 09:00AM
No comments