ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్.. సర్వం కోల్పోయి యువకుడి ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజధాని చెన్నైలో జరిగింది. టీపీ సత్రానికి చెందిన నితీష్ కుమార్ (20) అరుంబాక్కం అమ్మన్‌కోవిల్ సమీపంలోని టాటూ దుకాణంలో పని చేసేవాడు. ఈ నెల 26వ తేదీ షాప్‌కి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆలస్యం కావడంతో అక్కడే పడుకుని ఉంటాడని వారు అనుకున్నారు. సోమవారం ఉదయం నితీష్‌కుమార్ తమ్ముడు షాప్‌కి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. Also Read: దీంతో అతడు వెంటనే కుటుంబసభ్యులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో నితీష్‌కుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: ‘‘ నా ఆత్మహత్యకు నేనే కారణం. కష్టపడి సంపాదించిన సొమ్మనంతా ఆన్‌లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నా. ఆ సొమ్మును తిరిగి సంపాదించాలని దుకాణంలో రూ.20వేలు దొంగిలించారు. ఆ మొత్తాన్ని కూడా ఆటలో కోల్పోయాను. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నా. ఈ నిర్ణయం తీసుకున్నందుకు అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చదివించండి’’ అని నితీష్ లేఖలో రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By July 29, 2020 at 09:27AM
No comments