గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. గర్భంతో ఉన్న మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన వివాహిత నాలుగు నెలల గర్భవతి. బుధవారం ఆమెను ఎత్తుకెళ్లిన ముగ్గురు దుర్మార్గులు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి తీసుకెళ్లారు. అక్కడ మెడపై కత్తి పెట్టి తమకు సహకరించకపోతే గొంతు కోసి చంపేస్తామని బెదిరించారు. Also Read: దీంతో బాధితురాలు మిన్నకుండిపోవడంతో ముగ్గురు కామాంధులు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి పరారయ్యారు. వారి కామ దాహానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలు కాసేపటి తర్వాత మేలుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
By July 09, 2020 at 09:03AM
No comments