గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై వెబ్ సిరీస్.. టైటిల్ కూడా ఫిక్స్
యూపీ ప్రముఖ గ్యాంగ్‌స్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతనిపై ఓ వెబ్ సిరీస్ రానుంది. వీధి రౌడీగా తన జీవితం ప్రారంభించిన వికాస్ దూబే అనంతరం గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అన్న విషయంపై వెబ్ సిరీస్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్రైమ్ థ్రిల్లర్ ఆధారంగా అనేక వెబ్ సిరీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా ప్రముఖులు గ్యాంగ్‌స్టర్ వికాస్ జీవితంపై దృష్టిపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికాస్ దూబెకి సంబంధించి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . క్రైమ్ థ్రిల్లర్‌కు హనక్ అనే టైటిల్ పెట్టారు. నిర్మాత మనీష్ వాత్సల్య వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో పాటు ఆయనకి సంబంధించిన చాలా సమాచారాన్ని మనీష్ ఇప్పటికీ సేకరించారు. ఈ వెబ్ సిరీస్‌లో వికాస్ దూబేను విలన్‌గా చూపించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రముఖ నటుడిని వికాస్ దూబే పాత్రకి ఎంపిక చేయనున్నామని ఆయన చెబుతున్నారు. Read More: వీధి రౌడీగా జీవితం ప్రారంభించిన వికాస్ దూబే ఆ తర్వాత పలువురు రాజకీయ నాయకుల అండదండలతో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. అతడిపై లేని కేసంటూ లేదు. హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు తదితర 60కిపైగా కేసులు ఉన్నాయి. ప్రధానమైన ఏ కేసులోనూ దూబెకు ఇంతవరకు జైలుశిక్ష పడలేదు. 2001లో స్వతంత్ర మంత్రి హోదాలో ఉన్న బీజేపీ నేత సంతోశ్ శుక్లాను శివ్లీ పోలీస్‌స్టేషన్‌లోనే హత్యచేశాడు. అయినా అతడిపై అభియోగాలు మోపలేకపోయారు. ఎనిమిది మంది పోలీసుల హత్య తర్వాత వికాస్‌ని టార్గెట్ చేశారు పోలీసులు. వికాస్ ఎన్‌కౌంటర్‌పై ఆయన భార్యతో సాటు కాన్పూరు వాసులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. తివారీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వికాస్ దుబేను అదుపులోకి తీసుకునేందుకు జూలై 2న పోలీసులు బిక్రూ గ్రామానికి వెళ్లగా.. అతడి గ్యాంగ్ వారిపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు నేలకొరిగారు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం దుబే వారం రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దుబే ఎన్‌కౌంటర్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బడా నాయకులు, పోలీసులకు సంబంధించిన రహస్యాలు బయటపెడతాడనే కారణంతోనే అతడిని హతమార్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By July 18, 2020 at 11:35AM
No comments