వైసీపీ ఎంపీకి ఛాలెంజ్ విసిరిన ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన సవల్‌ను స్వీకరించారు ఆర్‌ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ . హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్క్ లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని మనము స్వేచ్ఛగా గాలి తీసుకొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక మంచి కార్యక్రమం చేపట్టి మా చేత మొక్కల నాటించడం చాలా మంచి కార్యక్రమమని కొనియాడారు. సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అజయ్ భూపతి. తాను మరో ముగ్గురు సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసిరారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు , మజిలీ సినిమా డైరెక్టర్ శివ నిర్వనా. డైరెక్టర్ ప్రశాంత్‌కు ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటారు. తాను సవాల్ చేసిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సందర్భంగా కోరారు. Read More: టాలీవుడ్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సెలబ్రిటీలంతా జోరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికీ ప్రముఖ హీరోయిన్లు సమంత, రష్మిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా నిన్న యాంకర్ ధరణి ప్రియ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటారు యాంకర్ ఉదయ శ్రీ. ఆమె మరో నలుగురికి సవాల్ చేసింది. ఆర్‌జే శివ , సునీత , హేమంత్ , నటుడు సమీర్ లను ఈ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
By July 18, 2020 at 12:10PM
No comments