పేకాట శిబిరంపై దాడి.. లక్షల్లో నగదు స్వాధీనం
ఓవైపు కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న కొందరు మాత్రం ఏమాత్రం భయం లేకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మంది పేకాట రాయళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట మండల సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు పేకాట శిబిరాలపై దాడి చేశారు. రాత్రి రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో అర్థరాత్రి పోలీసులు పేకాట ఆడుతున్న వారిపై దాడులు చేశారు. తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న పది మంది పేకాటరాయుళ్ల ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 5 లక్షల 57 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక కారు, ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిని త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
By July 18, 2020 at 10:57AM
No comments