కరోనా కాలంలోనూ జోరుగా వ్యభిచారం.. ఐదుగురు సెక్స్‌వర్కర్లు, ఇద్దరు విటుల అరెస్ట్
ఓ వైపు దేశం మొత్తం కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే అక్రమార్కులు మాత్రం తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా విస్తరిస్తున్నారు. ఈ విపత్కర కాలంలో మనిషికీ మనిషికీ భౌతిక దూరం పాటించాలని, కనీసం షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వొద్దని డాక్టర్లు, వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటే కొందరేమో ఏకంగా అమ్మాయిల శరీరాలతో బిజినెస్ చేస్తూ రూ.లక్షల్లో దండుకుంటున్నారు. తాజాగా రాజధాని బెంగళూరులో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు చేధించారు. Also Read: బెంగళూరులోని యశ్వంత్‌పూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు విటులను అరెస్ట్ చేసి.. ఐదుగురు సెక్స్‌వర్కర్లను రక్షించారు. ఈ ముఠా అనేక ప్రాంతాల నుంచి అమాయక మహిళలను అక్రమంగా తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైమ్) సందీప్ పాటిల్ తెలిపారు. గతవారం కూడా నగరంలోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసి 27 మంది మహిళలను రక్షించినట్లు ఆయన వెల్లడించారు. Also Read:
By July 09, 2020 at 09:52AM
No comments