కొత్త ఇంట్లోనే యజమానిరాలిపై హత్యాచారం.. హైదరాబాద్‌లో ఘోరం
కొత్త ఇంట్లో పూజ పేరుతో వివాహితపై ఓ యువకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని జియాగూడలో జరిగింది. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేశవస్వామినగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొత్త ఇల్లు కట్టుకున్నారు. కాంట్రాక్టర్ వెంకటేశ్, అతని సోదరుడు మేస్త్రీ అయిన శ్రీహరి, భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి కొత్త ఇంట్లో సంప్రదాయం ప్రకారం తండ్గా అనే శాంతిపూజ, దావత్ చేసుకుంటామని కోరడంతో ఇంటి యజమాని అంగీకరించాడు. Also Read: దీంతో అందరూ కలిసి రాత్రివేళ మద్యం తాగుతూ దావత్ చేసుకున్నారు. ఈ దావత్‌కు మేస్త్రీ శ్రీహరి.. తన స్నేహితుడైన రాజేంద్రనగర్ రాంబాగ్ ప్రాంతానికి చెందిన రవి (30)ని కూడా ఆహ్వానించాడు. ఫుల్లుగా మద్యం సేవించిన రవి అర్ధరాత్రి సమయంలో సిగరెట్ తాగుతానని బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న ఇంటి యజమాని భార్య(47)ను చూసి కామంతో రగిలిపోయాడు. ఆమె చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో కంగారుపడి ఆమె చీరతోనే గొంతు బిగించి చంపేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రవితో పాటు మేస్త్రీ శ్రీహరి, కాంట్రాక్టర్ వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
By July 09, 2020 at 10:07AM
No comments