Breaking News

రఫేల్ జెట్ నడిపిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన కశ్మీరీ


ఒప్పందంలో భాగంగా అత్యాధునిక తొలి విడతలో ఐదింటిని భారత్‌కు ఫ్రాన్స్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ విమానాలు సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరగా.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భారత్ చేరుకోనున్నాయి. హరియాణాలో అంబలా వైమానిక స్థావరంలోకి అడుగుపెట్టనున్న ఈ విమానాలకు ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కే భదౌరియా సాదరంగా ఆహ్వానించనున్నారు. కాగా.. రఫెల్ యుద్ధ విమానం నడిపిన తొలి భారత పైలట్‌గా ఎయిర్ కమాండర్ చరిత్ర సృష్టించారు. తొలి దశలో ఫ్రాన్ అందజేసిన ఐదు విమానాల్లో ఒకదాన్ని కశ్మీర్‌కు చెందిన హిలాల్ నడిపారు. అనంత్‌నాగ్‌కు చెందిన రిటైర్డ్ డీఎస్పీ తనయుడైన హిలాల్... వైమానిక దళంలో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిరేజ్ 2000, మిగ్ 21 తదితర ఫైటర్ జెట్ లపై 3 వేలకు పైగా గంటలు విజయవంతంగా ప్రయాణించారు. ప్రపంచంలోని ఉత్తమ ఫ్లయింగ్ అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన తండ్రి మొహమ్మద్ రాథోడ్ డీఎస్పీగా పనిచేశారు. భారత్ అవసరాలకు అనుగుణంగా రఫెల్ యుద్ధ విమానాలను తీర్చిదిద్దడంలో హిలాల్ తనవంతు సహకారాన్ని అందించారు. ఫ్రాన్స్ వైమానిక ట్యాంకుల ద్వారా గాల్లోనే రఫేల్ యుద్ధ విమానాలకు ఇంధనం నింపడంలో 150 మంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెక్నీషీయన్లు, యుద్ధ విమానాలను నడిపే 27 మంది పైలట్ల శిక్షణ బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించారు. కశ్మీర్ యువతకు హిలాల్ ప్రేరణగా నిలిచారని, తమకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పక్కింటి వ్యక్తి జునైద్ అహ్మద్ అన్నారు. ‘మా కాలనీ, అనంతనాగ్ పట్టణం బక్షియాబాద్ నుంచి వచ్చిన కమాండర్ హిలాల్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అటు, హిలాల్ రాథేర్‌పై సోషల్ మీడియాలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో అన్మోల్ పండిత్ అనే వ్యక్తి.. ‘దేవుడు మిమ్మల్ని అన్ని రంగాలలో ఆశీర్వదిస్తాడు. నేను కూడా బక్షియాబాద్ నుంచి వచ్చాను, మిమ్మల్ని డిఎస్పి సాహిబ్ కొడుకుగా గుర్తుంచుకుంటాను’ అని రాశారు. 1988లో ఐఏఎఫ్‌ బ్యాచ్‌కు చెందిన హిలాల్.. పలుమార్లు ఉగ్రవాదుల నుంచి బెదరింపులను ఎదుర్కొన్నారు. వివాహ సమయంలో ఆయన కుటుంబానికి బెదిరింపులు రావడంతో రెండు రోజుల ముందే అనంత్‌నాగ్ నుంచి జమ్మూలోని నగోర్తాకు రావాల్సి వచ్చింది.


By July 29, 2020 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iaf-officer-who-played-key-role-in-rafale-jets-delivery-hero-back-home-in-kashmir/articleshow/77236016.cms

No comments