మూడు నెలల గర్భిణిని చంపేసిన భర్త.. అదనపు కట్నం కోసం దారుణం
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హతమార్చాడో భర్త. అది చాలదన్నట్లు ఆమె ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని వదిలేసి కుటుంబంతో కలిసి పరారయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాలోని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాములు–యాదవ్వ దంపతులకు అంజలి(23) అనే కూతురు ఉంది. ఆమెను 2018, ఏప్రిల్ నెలలలో హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన అభిలాష్‌కు వివాహం జరిపించారు. Also Read: కొంతకాలం వరకు సాఫీగానే వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఏడాది క్రితం బైక్ కొనివ్వాలని అభిలాష్ కోరగా అత్తమామలు రూ.50వేలు ఇచ్చారు. అది చాలదన్నట్లు అదనంగా మరో రూ.లక్ష కట్నం తీసుకురావాలంటూ అతడు భార్యను వేధిస్తున్నాడు. దీనిపై మూడుసార్లు పెద్దల మధ్య పంచాయతీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం అంజలి మూడు నెలల గర్భిణి. రెండ్రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమెన స్నేహితుడి పెళ్లి ఉందంటూ అభిలాష్ తిరిగి తీసుకొచ్చాడు. అదనపు కట్నం కోసం మంగళవారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. దీంతో అభిలాష్ ఆవేశంలో అంజలి గొంతు నులిమి చంపేశాడు. Also Read: అనంతరం తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ స్థానికులకు చెప్పాడు. అందరినీ నమ్మించేందుకు డాక్టర్‌ను రప్పించి పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మీ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ అభిలాష్ తన అత్తమామలకు ఫోన్ చేసి అంజలి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి కుటుంబంతో కలిసి పరారయ్యాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అంజలి తల్లిదండ్రులు విగతజీవిగా పడివున్న కూతురిని చూసి బోరున విలపించారు. తమ కూతురు చావుకు అల్లుడే కారణమని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ మృతదేహంతో ఇంటి ఎదుట బైఠాయించారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింపజేశారు. ఈ క్రమంలోనే అభిలాష్ తన తల్లి సాయవ్వ, అమ్మమ్మ నర్సమ్మ, చెల్లెలు సోనీతో కలిసి హవేళిఘణాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యను తానే చంపినట్లు అంగీకరించడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:
By July 29, 2020 at 12:13PM
No comments