Breaking News

పార్లమెంట్ భవనం కూల్చివేస్తాం.. కేంద్రం సంచలన ప్రకటన


దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న భారత పార్లమెంట్ భవనం కూల్చివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పురాతన భవనాన్ని కూల్చేస్తామని కేంద్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. భవనం అవసరాలకు సరిపోవడం లేదని, సాంకేతికత లేదు అని చెప్తూ కూల్చి వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని చెప్పింది కేంద్రం. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 1921 లో కట్టడం మొదలు పెట్టి 1937 లో పూర్తి చేసారు అని, ఇప్పటికే వందేళ్ళు దాదాపుగా పూర్తి అయింది అని కేంద్రం పేర్కొంది.. ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనం కావడంతో.. భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది.


By July 29, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/modi-govt-want-to-demolish-parliament-building-filed-an-affidavit-before-the-supreme-court/articleshow/77235901.cms

No comments