సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారా..!?
సోనూసూద్ ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా వినిపిస్తోంది. సాయం చేయాలని రెక్వెస్ట్ చేస్తే చాలు గంటల్లోనే తనకు తోచినంత సాయం చేసేస్తున్నాడు. దీంతో సినిమాల్లో విలన్‌గా నటించే ఈయన్ను అభిమానులు, అనుచరులు, సాయం పొందినవాళ్లు ‘రియల్ హీరో’ అని పిలుచుకుంటున్నారు. ఇంకొందరు ‘సూపర్ మ్యాన్’లా భావిస్తున్నారు. అలా రోజురోజుకూ సోనూ క్రేజ్ పెరిగిపోతుండటంతో తెరపైకి కొత్త అంశం వచ్చింది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని.. అలా వస్తే ఆయన మరింత మందికి సాయం చేసేందుకు ఒక ఫ్లాట్ ఫామ్ అనేది ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ఇటీవల చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ ఇచ్చిన సోనూను ఓ ప్రముఖ తెలుగు చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయాల్లోకి వస్తారా..? వచ్చే ఉద్దేశ్యముంటే ఎంట్రీ ఎప్పుడు..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనే ప్రశ్నలు సోనూకు ఎదురయ్యాయి. ఇందుకు ఆయన స్పందిస్తూ చాలా లాజికల్‌గా సమాధానమిచ్చారు. తాను ఇప్పట్లో రాజకీయల గురించి ఏమీ అనుకోలేదన్నారు. అంతటితో ఆగని ఆయన.. సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కదా..? ఒక నటుడిగా తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. తాను ఇంకా చాలా తెలుగు, హిందీ సినిమాల్లో నటించాలని.. ఇవన్నీ అయ్యాక టైమ్ వచ్చినప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తానని సోనూ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను నటుడిగానే కొనసాగుతానని తేల్చిచెప్పారు. మరి మున్ముంథు రాజకీయాల్లోకి సోనూ వస్తే ఏ పార్టీలో చేరుతారో వేచి చూడాలి.
By July 29, 2020 at 03:20PM
No comments