‘పవర్ స్టార్’ మూవీ కలెక్షన్స్ ఎంతంటే..!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘పవర్ స్టార్’. ఇటీవల ఈ చిత్రాన్ని ఏటీటీని అడ్డాగా మార్చుకుని రిలీజ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ సినిమాకు రివ్యూలు ఎక్కడ పాజిటివ్‌గా రాలేదు. సినిమాను మాత్రం పెద్ద ఎత్తున జనాలు చూసేశారని తెలుస్తోంది. అసలు ఈ సినిమాకు ఏ మాత్రం కలెక్షన్స్ వచ్చాయి..? ఇంతకీ లాభలొచ్చాయా..? లేకుంటే ఉన్న డబ్బులే ఊడిపోయాయా..? అనే విషయంపై ఆర్జీవీనే స్వయంగా క్లారిటీ ఇచ్చుకున్నారు.
గట్టిగానే వచ్చిందిగా!
ఇప్పటికే ఆర్జీవీ ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ చిత్రాలను ఓటీటీలో వదిలాడు. ఈ రెండు సినిమాలకు ఆశించిన దానికంటే ఎక్కువే కలెక్షన్లు కురిసాయని వినికిడి. అయితే ఈ రెండు చిత్రాల కంటే ‘పవర్ స్టార్’ కే భారీగానే కలెక్షన్స్ వచ్చాయని టాక్. మరోవైపు ఇప్పటి వరకూ ఓటీటీలో వచ్చిన సినిమాలన్నింటిలో కల్లా ‘పవర్ స్టార్’కే గట్టిగా కాసుల వర్షం కురిసిందని తెలుస్తోంది. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్‌కు 150 రూపాయల టికెట్టు పెట్టగా.. సినిమా రిలీజ్ అయ్యాక బుక్ చేసుకుంటే టికెట్ 250 రూపాయలుగా టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వర్మకి కోటి రూపాయలు రాగా.. ఆ తర్వాత కూడా మంచి వసూళ్లే వచ్చాయట.
చెబితే గుండెలు పగులుతాయ్!
అయితే.. ఎక్కువగా పవన్ ఫ్యాన్స్, మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు చూశారని అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్లు సైతం ఈ సినిమాను వీక్షించారట. సో.. ఆర్జీవీ ఆశించిన దానికంటే భారీగానే కలెక్షన్స్ వచ్చాయన్న మాట. ఇదే విషయమై ఆర్జీవీ స్పందిస్తూ.. అసలు ఈ సినిమాను ఎంతమంది చూశారు..? ఎంత డబ్బు వచ్చింది..? అనేది చెబితే గుండెలు పగిలి చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని వాళ్ల ఆరోగ్యాల దృష్ట్యా తాను లెక్కలు చెప్పట్లేదని డిబెట్ వేదికగా ఆర్జీవీ చెప్పారు. మొత్తానికి చూస్తే ఆర్జీవీ అనుకున్నది సాధించాడన్న మాట.
By July 29, 2020 at 03:30PM
No comments