Breaking News

ఆగస్టులో ‘మెగా’ వేడుక.. ఫ్యాన్స్‌కు పండగే!


అవును మీరు వింటున్నది నిజమే.. ఆగస్టులో మెగా ఫ్యామిలీలో వేడుక జరగబోతోంది. ఈ వేడుకకు మెగా హీరోలంతా ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారట. అంటే.. మెగాభిమానులకు ఆ రోజు ఇక పండగే అన్న మాట. తనకు మ‌న‌సైన తోడు దొరికిందని త్వర‌లో పెళ్లి పీట‌లు ఎక్కబోతున్నట్టు లాక్ డౌన్‌లో మెగా ప్రిన్స్ నిహారిక‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రిన్స్‌కు కాబోయే భర్త గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు చైత‌న్య. కాగా.. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇప్పటికే మాట్లాడుకోవడాలన్నీ అయిపోగా.. వివాహ నిశ్చితార్థం ఆగస్టులో జరుగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వివాహం మాత్రం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండబోతోందట.

కాగా.. ఇటీవల వరుణ్ తేజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆగస్టులో ఇంట్లో ఓ వేడుక ఉంటుందని చెప్పకనే చెప్పాడు. ఆ వేడుక మరేదో కాదు.. నిహారిక నిశ్చితార్థం అయ్యి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షాపింగ్ అంతా పూర్తవ్వగా.. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వేడుక కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

ఇవన్నీ అటుంచితే.. ప్రస్తుతం దీక్షలో ఉన్న పవన్ ఆగస్టుతో పూర్తి చేసుకోబోతున్నాడు. ఆయనొస్తే వేడుక ఎలా ఉంటుందో.. అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఇక మెగా హీరోలు ఆ వేడుక రోజు ఎక్కడున్నా సరే కచ్చితంగా హాజరవ్వాలని నిర్ణయించారట. డైరెక్టుగా వేడుకను చూడలేకపోయినా ఆ రోజు మాత్రం అభిమానులు టీవీలకు అతుక్కుపోతారేమో. ఆగస్టులోనే నిశ్చితార్థ వేడక ఉంటుందా..? లేదా..? అనేదానిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందట.



By July 29, 2020 at 03:16PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52002/mega-function.html

No comments