చాక్లెట్ ఆశ చూపించి పైశాచికం.. ఇద్దరు చిన్నారులపై అత్యాచారం
చాక్లెట్ ఆశ చూపించి ఓ కామాంధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తెలంగాణలోని జిల్లాలో వెలుగుచూసింది. ఎడపల్లి మండలంలోని జంలం గ్రామానికి చెందిన నారాయణ (50) అనే వ్యక్తి గత పదిహేనేళ్లుగా జానకంపేటలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఆదివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న 8, 7ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై కన్నేశాడు. వారితో మంచిగా మాట్లాడుతూ చాక్లెట్లు కొనిస్తానని చెప్పి పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరి దుస్తులు విప్పేసి అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: కాసేపటి తర్వాత ఇంటికెళ్లిన బాలికలు జననాంగాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పరిశీలించారు. అక్కడ రక్తస్రావం అవుతుండటంతో ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నారాయణను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By July 06, 2020 at 09:47AM
No comments