అమెరికా నైట్ క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ కరోలినాలోని ఒక నైట్‌క్లబ్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రగాయాలపాలయ్యారు. అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 12 మంది గాయపడ్డారని.. వీరిలో కనీసం నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.. లూయిస్, బోల్ట్‌గా గుర్తించారు అధికారులు. అర్థరాత్రి అటువైపుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ సిబ్బందికి నైట్ క్లబ్ లోపల ఏదో అలికిడి వినిపించింది. దీంతో వెంటనే ఇతర ఎమర్జెన్సీ పోలీసులకు కూడా సమాచారం అందించారు. అందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అనేక మంది గాయాలతో నేలపై పడి ఉన్నారు. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. కాల్పుల ఘటనకు కారణం ఏంటన్న విషయం ఇంకా తెలియలేదు. పోలీసులకు ఇంతవరకు ఎవరిని అదుపులోకి కూడా తీసుకోలేదని సమాచారం.
By July 06, 2020 at 09:35AM
No comments