ఢిల్లీ: నేడు కరోనాను.. 1918లో స్పానిష్ ఫ్లూను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు
చిన్నతనంలో స్పానిష్ ఫ్లూను జయించిన వ్యక్తి.. మరో వందేళ్ల తర్వాత నేడు కరోనా మహమ్మారిని కూడా జయించాడు. ఢిల్లీకి చెందిన 106 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాడు. అయితే, 1918లో ప్రపంచాన్ని కుదిపేసిన స్పానిష్ ఫ్లూ ఇతనికి సోకింది. నాలుగేళ్ల వయసున్నప్పుడు అతడికి స్పానిష్ ఫ్లూ సోకింది. అతనికి బ్యాలంలో స్పానిష్ ఫ్లూ సోకిందో, లేదోనన్న విషయం పక్కన పెడితే 106 ఏళ్ల వయసులో కరోనా నుంచి కోలుకోవడం అద్బుతమని వైద్యులు అన్నారు. వృద్ధుడి భార్య, కుమారుడి సహా కుటుంబంలో మరో ఇద్దరు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక, వీరికంటే తొందరగానే వృద్ధుడు కోలుకోవడం విశేషం. అతడి కుమారుడు (70) కంటే ముందే వైరస్‌ను జయించాడని వైద్యులు తెలిపారు. వృద్ధుడు, అతడి భార్య, కుమారుడు సహా మరొకరికి వైరస్ సోకడంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చికిత్స తీసుకున్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ నుంచి బయటపడ్డ అతడు.. నేడు కరోనా వైరస్‌ను జయించాడు.. కుమారుడి కంటే వేగంగా కోలుకున్నాడని ఆస్పత్రిలోని సీనియర్ వైద్యుడు తెలిపాడు. స్పానిష్ ఫ్లూ విజృంభించడంతో ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది దీని బారినపడ్డారు. ‘1918 ఇన్‌ఫ్లూయేంజా ఇటీవలి చరిత్రలో అత్యంత తీవ్రమైన మహమ్మారి. ఏవియన్ మూలం జన్యువులతో కూడిన హెచ్1ఎన్1 వైరస్ వల్ల ఇది సంభవించింది. వైరస్ ఎక్కడ ఉద్భవించిందనే దానిపై సార్వత్రిక ఏకాభిప్రాయం లేనప్పటికీ, ఇది 1918-1919 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 1919-19లో ప్రబలిన వైరస్ స్పానిష్ ఫ్లూ చాలా తీవ్రమైంది.. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదో వంతు మరణాలు భారత్‌లోనే చోటుచేసుకున్నాయి.
By July 06, 2020 at 09:59AM
No comments