తల్లీకూతుళ్లపై ముగ్గురి సామూహిక అత్యాచారం... హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సందయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుండే మహిళ, ఆమె కుమార్తెపై ఇంటి యజమాని, ఆయన ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ వివాహిత(35) తన కూతురు(15), కుమారుడితో కలిసి ఓ ఇంట్లో నివాసముంటోంది. తనతో పాటు కూతురిపై ఇంటి యజమాని, అతడి ఫ్రెండ్స్ లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: ఇంటి యజమాని తమకు ఇచ్చిన ఆహార పదార్ధాల్లో మత్తు మందు కలిపి ఇచ్చాడని, మత్తులోకి జారుకున్నాక తనతో పాటు కూతురిపైనా ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలితో పాటు కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి, కొడుకును నీలోఫర్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 22, 2020 at 01:11PM
No comments