‘ఆచార్య’ విషయంలో కొరటాల ఇలా ఫిక్సయ్యాడు
కొరటాల శివ.. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా తీసాక రెండేళ్ళకి చిరుతో ఆచార్య సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. కొరటాల రామ్ చరణ్ కోసం ట్రై చేస్తే చిరు తగలడంతో చిరు కోసం ఆచార్య కథ రాసి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి చిరు కోసం వెయిట్ చేసి మరీ ఆచార్యని పట్టాలెక్కించాడు. ఏదో మంచిగా షూటింగ్ జరుగుతుంది. చిరు కూడా కొరటాలకి ఫాస్ట్ గా సహకరిస్తున్నాడు.... దసరా నాటికి సినిమా ఫినిష్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేద్దామనుకుని ప్లాన్ చేస్తే కరోనా మొత్తం మటాష్ చేసింది.
నాలుగు నెలలుగా షూటింగ్స్ లేక కొరటాలకి చిరాకు పుట్టింది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. కనీసం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కరోనాతో క్లారిటీ లేదు. ఇక ఆచార్య సినిమా నేపథ్యం, దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని హీరో చిరు పెకిలించడం... దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆఫీసర్ గా చిరు కేరెక్టర్ ఉండబోతుంది. అందుకే సినిమా కోసం ఓ పెద్దదేవాలయం చూసుకుని షూట్ చెయ్యడానికి పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటే కరోనా వలన ఇప్పుడు అలాంటి దేవాలయంలో సినిమా షూటింగ్ చెయ్యడం జరిగేపని కాదు.. అందుకే కొరటాల శివ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక దేవాలయం సెట్‌ను రూపొందించే పనిలో బిజీగా వున్నాడట. ఎలాగూ షూటింగ్ కోసం బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అందుకే కొరటాల శివ ఇప్పుడు హైదరాబాద్ నగర శివార్లలో దేవాలయం సెట్ వేసుకుని ఆ సెట్ లో కూల్ గా ఆచార్య షూటింగ్ చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడని ఫిలింనగర్ టాక్.
By July 22, 2020 at 11:51PM
No comments