Breaking News

రాజస్థాన్ సంక్షోభంలో మరో మలుపు.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ


రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌, ఆయన వర్గానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు సూచించగా.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేలపై జులై 24 వరకు చర్యలు తీసుకోరాదంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ‘పార్టీ ఫిరాయింపుల వ్యతిరేకతపై స్పీకర్ మాత్రమే నిర్ణయించగలరని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో నిర్వచించింది. నోటీసులు పంపడానికి స్పీకర్‌కు పూర్తి అధికారం ఉంది.. సభాపతి నిర్ణయం తర్వాత మాత్రమే దీనిని న్యాయపరంగా సమీక్షించవచ్చు’అని సీపీ జోషీ వ్యాఖ్యానించారు. రెబల్ ఎమ్మెల్యేలు పిటిషన్ రాజ్యాంగ నిబంధనలు విచ్ఛిన్నానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే తన హక్కులను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టును స్పీకర్ ఆశ్రయించినా హైకోర్టు ఆదేశాలను సమర్ధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రెండు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం స్ఫూర్తితో నోటీసులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. అటు, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హత నోటీసులు ఇవ్వ డం సరికాదని సచిన్‌ వర్గం తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ సంస్థల సాయంతో, ధనబలంతో పడగొట్టేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.


By July 22, 2020 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-speaker-cp-joshi-knocked-supreme-court-for-high-court-hearing/articleshow/77103173.cms

No comments