సరిహద్దుల్లో కొనసాగుతున్న బలగాల ఉపసంహరణ.. అయినా, భారత్ అప్రమత్తం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/76845185/photo-76845185.jpg)
సరిహద్దుల్లోతూర్పు లడఖ్‌లో 2 నెలల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభించిన భారత్, చైనాలు.. మంగళవారం దీనిని కొనసాగించాయి. వివాదానికి కేంద్ర బిందువులుగా ఉన్న హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి భారత్, చైనాల బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీల మధ్య ఆదివారం జరిగిన చర్చల అనంతరం తూర్పు లడఖ్‌లో ఇరు దేశాలూ బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వివాదాస్పద ప్రాంతంలో చైనా సైన్యాల ఉపసంహరణలను భారత్ నిశితంగా గమనిస్తోంది. అదే సమయంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వీలుగా అత్యున్నత స్థాయిలో అప్రమత్తతను కొనసాగిస్తోంది. జూన్ 30న జరిగిన రెండు దేశాల కోర్ కమాండర్ల చర్చల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల మధ్య 3 కిలోమీటర్ల మేర ‘బఫర్ జోన్’ (నిస్సైనిక ప్రాంతం)ను ఏర్పాటు చేస్తున్నారు. గల్వాన్‌లో చైనా తన సైన్యాన్ని రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వెనక్కి మళ్లించింది. పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద తన శిబిరాలను తొలగించింది. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, గల్వాన్ ప్రాంతాల్లో భారత్ కూడా కొంత దూరం వెనక్కి వచ్చింది. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య ‘బఫర్ జోన్’ ఏర్పడింది. రాజకీయ-దౌత్యస్థాయి చర్చల అనంతరం చైనా తన సైన్యాన్ని వెనక్కు మళ్లిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ నుంచి 25వేలకుపైగా సైనికులు, ట్యాంకులు, ఆయుధాలను మోహరించిన చైనా... వీటిని క్రమంగా జిన్జియాంగ్, టిబెట్‌లోని శాశ్వత స్థావరాలకు మళ్లిస్తోందని పేర్కొన్నాయి.‘చైనాతో 1,597 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో మోహరించిన పీఎల్‌ఏ దళాల తొలగించడం వేరే విషయం.. ఇది చాలా వరకు దక్షిణ జిన్జియాంగ్ కమాండర్ పరిధిలో ఉండటానికి అవకాశం లేదు.. చైనా అగ్రనాయకత్వం సూచనలతో మే నెలలో భారత భూభాగంలోకి అనేక చొరబాట్లు జరిగాయని’ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఉద్రిక్తత తగ్గుముఖం పడుతున్నా ఇది సెప్టెంబర్-అక్టోబర్ వరకు సాగవచ్చని అంటున్నారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి బలగాలను వెనక్కు తగ్గించడం.. మంచిది కానీ, ముప్పు ఇంకా ఉంది. ఎల్‌ఏసీ వెంట పిఎల్‌ఎ దళాలు వెనక్కి తగ్గే సూచనలు లేవు. జిన్జియాంగ్‌లోని హోటాన్, కష్గర్ ఎయిర్‌బేస్‌ల వద్ద సైన్యం, బాంబర్ల అదనపు మోహరింపులో 30% నుంచి 40% తగ్గింపు లేదు’.
By July 08, 2020 at 07:39AM
No comments