చెరువులోకి దూసుకెళ్లిన బస్సు... 21 మంది మృతి
వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 15 మంది గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటన చైనాలో జరిగింది. అధికారులు వివరాల ప్రకారం ... హైస్కూల్ విద్యార్థుల్ని తీసుకొని బస్సులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులంతా ఎంట్రాన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు బస్సులో బయల్దేరారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న బస్సు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు రెయిలింగ్ ను ఢీకొని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న 21 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడిపోయిన బస్సును బయటకు వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2020 ఏడాది అంతా విషాదాలే అంటూ పోస్టులు పెడుతున్నారు.
By July 08, 2020 at 08:58AM
No comments